నిత్యం ప్రజల్లో ఉన్నవారికే.. : చంద్రబాబు

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:56 PM

విజయవాడ: టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాయకులను ఉద్దశించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి స్పందించారు. పదవులు రావనే భయంతోనే వాళ్లు పార్టీ మారుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో జరిగిన కొండవీడు ముగింపు ఉత్సవాల్లో ఆయన చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. కొండవీడు కోట దిగువన నిర్వహించిన బహిరంగ సభలో […]

నిత్యం ప్రజల్లో ఉన్నవారికే.. : చంద్రబాబు
Follow us on

విజయవాడ: టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాయకులను ఉద్దశించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి స్పందించారు. పదవులు రావనే భయంతోనే వాళ్లు పార్టీ మారుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో జరిగిన కొండవీడు ముగింపు ఉత్సవాల్లో ఆయన చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. కొండవీడు కోట దిగువన నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండేవారికే టీడీపీ టిక్కెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ విభజన గాయాలను రేపుతున్నారని విమర్శించారు. బిజెపి, టీఆర్ఎస్, వైసీపీలు ఒక్కటేనని అన్నారు. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని, నవ్యాంధ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ అడ్డుపడుతుందని ఆరోపించారు.