రూ.100 లంచం కేసులో..ఎఫ్‌ఐఆర్ బుక్ చేసిన సీబీఐ

|

Dec 02, 2019 | 9:56 PM

సీబీఐ..దేశంలో అత్యున్నత గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ అన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ దేశంలోని ఎంతో మంది రాజకీయ నాయకులకు చుక్కలు చూపించింది. లక్షల్లో అవినీతి అధికారులు బెండు తీసింది. అటువంటి సంస్థ ఇప్పుడు రూ.100 లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి చెందని ఇద్దరు ఉద్యోగులపై కేసు బుక్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..  ఉత్తర్​ప్రదేశ్‌లోని ప్రతాప్​గఢ్​ జిల్లా కుందా ప్రాంతానికి చెందిన మహిళ పోస్టల్ ఏజెంట్‌గా పనిచేస్తోంది. చిన్న, చిన్న గ్రామాల్లోని ప్రజలకు […]

రూ.100 లంచం కేసులో..ఎఫ్‌ఐఆర్ బుక్ చేసిన సీబీఐ
Follow us on

సీబీఐ..దేశంలో అత్యున్నత గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ అన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ దేశంలోని ఎంతో మంది రాజకీయ నాయకులకు చుక్కలు చూపించింది. లక్షల్లో అవినీతి అధికారులు బెండు తీసింది. అటువంటి సంస్థ ఇప్పుడు రూ.100 లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి చెందని ఇద్దరు ఉద్యోగులపై కేసు బుక్ చేయడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..  ఉత్తర్​ప్రదేశ్‌లోని ప్రతాప్​గఢ్​ జిల్లా కుందా ప్రాంతానికి చెందిన మహిళ పోస్టల్ ఏజెంట్‌గా పనిచేస్తోంది. చిన్న, చిన్న గ్రామాల్లోని ప్రజలకు పొదుపు పట్ల అవగాహాన కల్పించి, వారితో డబ్బులు డిపాజిట్ చెయ్యడం ఆమె డ్యూటీ. అయితే ఆమె ప్రజల నుంచి సేకరించిన సొమ్మును..పోస్టల్ సబ్ ఆపీసులో జమ చేసే సమయంలో ప్రతి ఇరవై వేలకు, వంద రూపాయలు లంచంగా ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ సరోజ్, పోస్టల్​ అసిస్టెంట్ సూరజ్​ మిశ్రా డిమాండ్ చేశారు. దీంతో ఆ పోస్టల్ ఏజెంట్ భర్త సీబీఐని ఆశ్రయించారు. వారు  రూ.500, రూ.300  లంచం తీసుకున్న ఆధారాలను కూడా ఆ దంపతులు దర్యాప్తు అధికారులకు సమర్పించారు. అడిగిన సొమ్ము ఇవ్వకుండా, పనులను జాప్యం చేస్తున్నారంటూ మహిళ ఫిర్యాదులో పేర్కుంది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సదరు అధికారులపై కేసు బుక్ చేసింది. ఏది, ఏమైనా రూ100 లంచం ఆరోపణలతో సీబీఐ కేసు బుక్ చెయ్యడం ఇప్పడు రకరకాల చర్చలకు తావిస్తుంది.