ఖొమైనీ ! బీ కేర్ ఫుల్ ! ట్రంప్ వార్నింగ్ !

ఉక్రేనియన్ విమానం కూలిన ఘటనపై తమ దేశంలో జరిగిన నిరసన ప్రదర్శనలకు యూరప్ దేశాల అనుచిత ప్రచారమే కారణమని ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖొమైనీ ఆరోపించారు. ఈ నెల 8 న జరిగిన ఈ ఘటన ఘోరమైన ట్రాజెడీ అని, మా దేశ అత్యంత శక్తిమంతుడైన సైనికాధికారి త్యాగనిరతిని తాము వృధా కానివ్వబోమని ఆయన అన్నారు. (అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అత్యున్నత సైనికాధికారి ఖాసిం సులేమాన్ మృతి చెందిన విషయం విదితమే).  ‘ అమెరికా మరణించాలి […]

ఖొమైనీ ! బీ కేర్ ఫుల్ ! ట్రంప్ వార్నింగ్ !

Edited By:

Updated on: Jan 18, 2020 | 12:51 PM

ఉక్రేనియన్ విమానం కూలిన ఘటనపై తమ దేశంలో జరిగిన నిరసన ప్రదర్శనలకు యూరప్ దేశాల అనుచిత ప్రచారమే కారణమని ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖొమైనీ ఆరోపించారు. ఈ నెల 8 న జరిగిన ఈ ఘటన ఘోరమైన ట్రాజెడీ అని, మా దేశ అత్యంత శక్తిమంతుడైన సైనికాధికారి త్యాగనిరతిని తాము వృధా కానివ్వబోమని ఆయన అన్నారు. (అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అత్యున్నత సైనికాధికారి ఖాసిం సులేమాన్ మృతి చెందిన విషయం విదితమే).  ‘ అమెరికా మరణించాలి ‘ అని నినదిస్తూ.. ఇరాన్ లో లక్షలాది ప్రజలు హాజరైన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఖొమైనీ.. మా దేశాన్ని తక్కువ అంచనా వేసేందుకు యూరప్ దేశాలు ఈ ప్లేన్ ట్రాజెడీని వినియోగించుకున్నాయని ఆరోపించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలను తమ శత్రు దేశాలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఘోర దుర్ఘటన వల్ల మనం ఇక్కడ విషాదంలో ఉంటే అక్కడ ఈ దేశాలు సంబరాలు చేసుకున్నాయని ఆయన దుయ్యబట్టారు. కాగా-ఖొమైనీ వ్యాఖ్యలను తప్పు పట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మీరు ఇప్పుడు మీ దేశ సుప్రీం కమాండర్ కాదని, మీ హోదాకు కాలం చెల్లిపోయిందని  ట్వీట్ చేశారు. మా దేశం పట్ల, యూరప్ దేశాల పట్ల మీరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు. ఇరాన్ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతోందని, మీ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న ఆయన.. మీరు ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుందని హెచ్చరించారు. నేను చివరి క్షణంలో  మీ దేశంపై ప్రతీకార చర్యలకు స్వస్తి చెప్పాను.. అది గుర్తుంచుకొండి  అని ట్రంప్ అన్నారు.