సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా పేలుళ్లు.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్

| Edited By:

Mar 30, 2019 | 1:37 PM

శ్రీనగర్‌ : సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా మరోసారి పేలుళ్లు జరిగాయి. జమ్మూకశ్మీర్‌ రాంబన్‌ జిల్లాలోని శ్రీనగర్‌ – జమ్మూ ప్రధాన రహదారిపై ఓ కారులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి కారు తుక్కుతుక్కయ్యింది. పేలుళ్లు జరిగే సమయానికి కాస్త ముందు.. ఇదే రహదారిపై భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్లింది. కారులో పేలుళ్లు జరగడంతో సైన్యం అప్రమత్తమైంది. కారులోని సిలిండర్‌ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా ?.. లేదా సీఆర్పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్‌గా మరో […]

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా పేలుళ్లు.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్
Follow us on

శ్రీనగర్‌ : సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా మరోసారి పేలుళ్లు జరిగాయి. జమ్మూకశ్మీర్‌ రాంబన్‌ జిల్లాలోని శ్రీనగర్‌ – జమ్మూ ప్రధాన రహదారిపై ఓ కారులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి కారు తుక్కుతుక్కయ్యింది. పేలుళ్లు జరిగే సమయానికి కాస్త ముందు.. ఇదే రహదారిపై భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్లింది. కారులో పేలుళ్లు జరగడంతో సైన్యం అప్రమత్తమైంది. కారులోని సిలిండర్‌ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా ?.. లేదా సీఆర్పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్‌గా మరో ఉగ్రదాడి జరిగిందా .. ? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. పుల్వామాలో ఫిబ్రవరి 14వ తేదీన సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందారు.

మరోవైపు అనంతనాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతనాగ్ లోని కోకర్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగి.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి.