పీఓకేలో భారత్ దాడి చేయొచ్చా?

|

Feb 26, 2019 | 9:53 AM

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ దాడి చేయొచ్చా? ఈ దాడిపై అంతర్జాతీయ సమాజం ఏమంటోంది? ఖండిస్తుందా? అగ్రదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు ఎదురు దాడి చేసే హక్కు ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి నియమాల్లోని చాప్టర్ – 7 ఇదే చెబుతోంది. […]

పీఓకేలో భారత్ దాడి చేయొచ్చా?
Follow us on

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ దాడి చేయొచ్చా? ఈ దాడిపై అంతర్జాతీయ సమాజం ఏమంటోంది? ఖండిస్తుందా? అగ్రదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు ఎదురు దాడి చేసే హక్కు ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి నియమాల్లోని చాప్టర్ – 7 ఇదే చెబుతోంది. దాని ప్రకారం ఏదైనా దేశంపై దాడి జరిగినప్పుడు రక్షణ చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ రక్షణ చర్యలు సందర్భాన్ని బట్టి పలు విధాలుగా ఉంటాయి. ఈ ఎదురుదాడి అవసరాన్ని అంతర్జాతీయ సమాజానికి భారత్ వివరణ ఇచ్చుకోవచ్చు.