మొక్కలు నాటితే పిల్లలు పుడతారా?

|

Mar 04, 2019 | 7:56 PM

పాలకొల్లు: మొక్కలు నాటితే పిల్లలు పుడతారా? వైద్యంతో పని లేకుండా.. ఒకే ఒక్క మొక్ నాటితే ఏవరు కావాలంటే వాళ్లు పుడతారా? ఆడ పిల్లకు ఓ మొక్క, మగ పిల్లాడికి మరో మొక్క నాటితే సంతాన సఫల్యమేనా? చదవడానికి విడ్డూరంగా, విచిత్రంగా ఉన్నా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ప్రచారం హోరెత్తుతోంది. స్థానిక శివదేవ స్వామి ఆలయంలో అభిషేకం చేసి, మొక్క నాటితే పిల్లలు పుడతారనే ప్రచారంతో ఆ ఆలయానికి సంతానం లేని దంపతులు మొక్కలతో క్యూ కట్టారు. […]

మొక్కలు నాటితే పిల్లలు పుడతారా?
Follow us on

పాలకొల్లు: మొక్కలు నాటితే పిల్లలు పుడతారా? వైద్యంతో పని లేకుండా.. ఒకే ఒక్క మొక్ నాటితే ఏవరు కావాలంటే వాళ్లు పుడతారా? ఆడ పిల్లకు ఓ మొక్క, మగ పిల్లాడికి మరో మొక్క నాటితే సంతాన సఫల్యమేనా? చదవడానికి విడ్డూరంగా, విచిత్రంగా ఉన్నా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ప్రచారం హోరెత్తుతోంది. స్థానిక శివదేవ స్వామి ఆలయంలో అభిషేకం చేసి, మొక్క నాటితే పిల్లలు పుడతారనే ప్రచారంతో ఆ ఆలయానికి సంతానం లేని దంపతులు మొక్కలతో క్యూ కట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఓ వింత ఆచారం ప్రచారంలో ఉంది. ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో.. వారు స్థానికంగా ఉన్న శివదేవ స్వామి ఆలయంలో అభిషేకం చేసి.. మొక్క నాటితే.. పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. శివరాత్రి వస్తే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. గతంలో వచ్చి మొక్కలు నాటిన వారికి సంతానం కలిగితే.. మరలా పిల్లలతో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారని చెబుతున్నారు భక్తులు.

త్రేతాయుగంలో ఆంజనేయుడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని, ఆ మహిమతోనే మొక్కలు నాటిన వారికి సంతానం కలుగుతోందని ఆలయ ప్రధాన అర్చకులు శర్మ అంటున్నారు. ఆలయాల్లో పూజలు చేసి మొక్కలు నాటితే జీవితంలో పిల్లలు పుట్టరని, మంచి డాక్టర్ వద్దకు వెళ్లి లోపం ఏమిటో తెలుసుకుని ట్రీట్‌మెంట్ తీసుకోవాలని హేతువాదులు సూచిస్తున్నారు.