
లద్దాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా దురాక్రమణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. హైదరాబాద్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. డ్రాగన్‌కు దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. చైనా వస్తువులను బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బేగంబజార్ అజీజ్ ప్లాజాలో చైనా వస్తువులను పగలగొడుతూ నిరసన తెలిపారు. చైనా ఉత్పత్తులు వాడి ఆత్మాభిమానం కోల్పోయే చర్యలు చేయమని ప్రతిజ్ఞ చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లోనూ అనేక వస్తువులు తయారీ చేస్తున్నారని.. వాటిని ఉపయోగించాలని వారు పిలుపునిచ్చారు. దేశహితం కోసం ఇకపై భారత ఉత్పత్తులే వాడటంతోపాటు… తమ వ్యాపారాల్లో చైనా వస్తువులు విక్రయించమని అన్నారు.
హైదరాబాద్‌లో చైనా వస్తువులను బహిష్కరించాలని భాగ్యనగర్ వ్యాపారుల నిర్ణయించిన విషయం తెలిసిందే. చైనా వస్తువులు విక్రయించొద్దని వ్యాపారుల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.