ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఉచిత బోర్‌వెల్స్…

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతులకు ఉచితంగా బోర్‌వెల్స్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత […]

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఉచిత బోర్‌వెల్స్...

Updated on: Jul 04, 2020 | 8:35 PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతులకు ఉచితంగా బోర్‌వెల్స్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది ప్రభుత్వం.

ఈ క్రమంలో బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది. అయితే భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయబోరు.