బూట్లతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

ప్ర‌జలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ కోల్పోయి బహిరంగంగా ఘర్షణకు దిగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లా సమన్వయ సమావేశంలోనే బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే పబ్లిక్‌గా గొడవపడ్డారు. ఓ శంకుస్థాపన కార్యక్రమం శిలాఫలకంలో తన పేరు ఎందుకు లేదని స్థానిక ఎమ్మెల్యేను ఎంపీ శరద్‌ త్రిపాఠీ నిలదీశారు. అందుకు తనే వద్దన్నానని ఎమ్మెల్యే రాకేశ్ భగేల్‌ బదులిచ్చారు. దీంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ […]

బూట్లతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

Updated on: Mar 07, 2019 | 11:51 AM

ప్ర‌జలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ కోల్పోయి బహిరంగంగా ఘర్షణకు దిగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లా సమన్వయ సమావేశంలోనే బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే పబ్లిక్‌గా గొడవపడ్డారు. ఓ శంకుస్థాపన కార్యక్రమం శిలాఫలకంలో తన పేరు ఎందుకు లేదని స్థానిక ఎమ్మెల్యేను ఎంపీ శరద్‌ త్రిపాఠీ నిలదీశారు. అందుకు తనే వద్దన్నానని ఎమ్మెల్యే రాకేశ్ భగేల్‌ బదులిచ్చారు. దీంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఎంపీ త్రిపాఠీ, ఆయనపై బూటుతో దాడిచేసి అసభ్య పదజాలంతో దూషించారు.

ఎంపీ చర్యలకు ఎమ్మెల్యే కూడా అదేరీతిలో స్పందించారు. అధికారులు, మీడియా ప్రతినిధులు ఎదురుగానే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. అక్కడే ఉన్న పోలీసు అధికారులు జోక్యం చేసుకుని వారిని పక్కకు తీసుకెళ్లారు. బాధ్యతారహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యూపీ బీజేపీ అధ్యక్షుడు ఎంఎన్ పాండే తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us