భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు

|

Nov 03, 2020 | 5:28 PM

కర్నూలు జిల్లా పాలిటిక్స్‌లో అత్యంత బలమైన కుటుంబంగా పేరున్న భూమా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. పరస్పరం పోలీసులకు పిర్యాదు చేసుకునే స్థాయికి విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి...

భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు
Follow us on

Big rift in Bhuma family: కర్నూలు జిల్లా పాలిటిక్స్‌లో అత్యంత బలమైన కుటుంబంగా పేరున్న భూమా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. పరస్పరం పోలీసులకు పిర్యాదు చేసుకునే స్థాయికి విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్తపై దివంగత భూమా నాగిరెడ్డి పినతండ్రి భూమా నారాయణ రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విభేదాలు వెలుగు చూశాయి. విజయ మిల్క్ డైరీ చైర్మన్ పదవి ఈ విభేదాలకు ఆజ్యం పోసింది.

అఖిలప్రియ భర్త భార్గవ రామ్ నాయుడు, అఖిల ప్రియ తమ్ముడు జగత్ రెడ్డిలపై విజయ మిల్క్ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి నంద్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నంద్యాలలోని భూమా నారాయణ రెడ్డి ఇంటికి వచ్చిన భార్గవ్ రామ్, జగత్ రెడ్డిలిద్దరు.. విజయ మిల్క్ డైరీ డైరెక్టర్లను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించా రని నారాయణ రెడ్డి ఆరోపించారు. వారిని తీసుకు వెళ్ళకుండా అడ్డుకున్నందుకు తనను చంపేస్తామని వారిద్దరు బెదిరించారని ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గత 25 సంవత్సరాలుగా వరుసగా విజయ మిల్క్ డైరీ చైర్మన్‌గా నారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆ పదవిని తన సోదరుడు భూమా జగత్ రెడ్డికి ఇప్పించేందుకు ఇటీవల భూమా అఖిల ప్రియ ప్రయత్నాలు మొదలు పెట్టారు. డిసెంబర్ నెలలో జరగనున్న ఎన్నికల్లో జగత్ రెడ్డిని ఛైర్మెన్‌గా చేసేందుకు అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదవి నుంచి తప్పుకోవాలని నారాయణ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను తప్పుకునేందుకు నారాయణ రెడ్డి ససేమిరా అనడంతోపాటు.. జగత్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించడంతో భార్గవ రామ్ ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్గవ రామ్, జగత్ రెడ్డిలిద్దరు నారాయణ రెడ్డికి సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడతో ఆయన పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

ALSO READ: అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్

ALSO READ: రెవెన్యూ అధికారిని చితక్కొట్టిన మహిళా రైతు

ALSO READ: సీఎంను తిట్టినందుకు ఆరు రోజుల కస్టడీ