సీఎంను తిట్టినందుకు ఆరు రోజుల కస్టడీ

ముఖ్యమంత్రిని తిట్టినందుకు ఓ వ్యక్తికి పోలీసు కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది ముంబయి లోకల్ కోర్టు. ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీలో వుండాలని నిర్దేశించింది. ముఖ్యమంత్రి, ఆయన తనయుడైన ఎమ్మెల్యే, మరో మంత్రి ఫోటోలను వాడుతూ బూతులు ట్వీట్ చేసినందుకు ఈ శిక్ష విధించింది కోర్టు.

సీఎంను తిట్టినందుకు ఆరు రోజుల కస్టడీ
Follow us

|

Updated on: Nov 03, 2020 | 5:51 PM

Police custody for scolding Chief Minister: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని తిట్టిపోసిన ఓ వ్యక్తికి ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది ముంబయిలోని ఓ లోకల్ కోర్టు. మంగళవారం నుంచి నవంబర్ 9వ తేదీ దాకా అంటే ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీలో వుండాలని నిర్దేశించింది.

సమీత్ థక్కర్ అనే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దుర్భాషలాడుతూ తన ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్లు పెట్టేవాడు. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే, రాష్ట్ర మంత్రి నితిన్ రావత్‌ల ఫోటోలు వాడుతూ గత జూన్ 1వ తేదీన తిరిగి జులై 1వ తేదీన అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్లు పెట్టాడు. దాంతో థక్కర్‌పై ముంబయిలోని వీపీ రోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వీపీ రోడ్ పోలీస్ స్టేషన్‌తోపాటు నాగ్‌పూర్‌ను సమీత్ థక్కర్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ 24వ తేదీన నాగ్‌పూర్ పోలీసులు థక్కర్‌ను అరెస్టు చేశారు. ఆ కేసులో సోమవారమే అతనికి బెయిల్ మంజూరు కాగా.. ఆ వెంటనే ముంబయి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. దాంతో కోర్టు అతనికి ఆరు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది.

ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

ALSO READ: అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ALSO READ: ఏపీ అసెంబ్లీ సెషన్‌పై చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు

ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు

ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్