మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. అక్రమ సంబంధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు, అనుబంధాలు, మంటగలసి పోతున్నాయి. తాజాగా కర్నాటకలో వివాహేతర సంబంధం ముగ్గురిని బలితీసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులను అనాథలుగా మార్చేసింది.
కర్నాటలోని చిక్కమగళూరు జిల్లా కడూరులో ఓ డెంటల్ డాక్టర్ భార్య ఇద్దరు పిల్లలతో హాయిగా జీవనంసాగిస్తున్నాడు. రేవంత్ బీరూరులో డెంటల్ క్లినిక్ నడుపుతున్నాడు. అయితే, డాక్టర్ క్లీనిక్ మాత్రం సమీపంలోని బీరూరులో ఉంది. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళతో డాక్టర్ కు పరిచయం ఏర్పడింది. ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరచూగా కలుస్తుండేవారు. విషయం డాక్టర్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
కుటుంబంలో తలెత్తిన వివాదాలు చివరకు భార్యను వదిలించుకునేలా చేశాయి. భార్యభర్తల మధ్య గొడవ తీవ్రం కావడంతో ఎలాగైన ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా భార్య నిద్రపోతున్న సమయంలో ఆమెకు పాయిజన్ ఇంజిక్షన్ చేశాడు. ఈనెల 17న ఘటన చోటుచేసుకుంది. తన భార్యను ఎవరో హత్య చేశారని కడూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా రేవంత్‌ను అనుమానించలేదు. ఇదిలా ఉంటే హత్యకు సంబంధించిన నివేదిక పోలీసులకు చేరింది. అందులో ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి హత్య చేసినట్లు బయటపడింది. దీంతో డాక్టర్ ను విచారించగా…దర్యాప్తులో మృతురాలిని భర్తే హత్యచేసినట్లుగా తేలింది.
దీంతో భయపడిపోయిన సదరు డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మర్నాడు రాత్రి చిక్కమగళూరు బండికొప్పలు వద్ద కారు నిలిపి సమీపంలోని రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు ప్రియురాలికి ఫోన్ చేశాడు. జరిగిన విషయం ఆమెకు వివరించాడు..తను సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చెప్పాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బెంగళూరు ఆర్‌ఆర్ నగర జవరేగౌడ లేఔట్‌లో నివాసం ఉంటున్న ప్రియురాలు కూడా సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలా వివాహేతర సంబంధం ముగ్గురిని బలితీసుకుంది. పిల్లలని అనాథలను చేసింది.
కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా వివాహేతర సంబంధాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు ప్రాణాలను తీయడంలో వెనుకడుగు వేయడంలేదు. పరువు ప్రతిష్టలను కీలకంగా భావిస్తున్న వ్యక్తులు వివాహేతర సంబంధాలను జీర్ణించుకోలేక హత్యలకు తెగబడుతున్నారు. లేదా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో పసి పిల్లలు అనాధలుగా మారుతున్నారు.