బీసీసీఐ కొత్త సీఈవోగా హేమంగ్ అమిన్

కొవిడ్ సంక్షోభ సమయంలోనూ భారత క్రికెట్​ బోర్డు (BCCI) కీలకపదవిలో మార్పులు చోటు చేసుకున్నాయి. బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్​ అమిన్​ను నియమించింది. ఐపీఎల్​ సీఈఓగా పనిచేసిన..

బీసీసీఐ కొత్త సీఈవోగా హేమంగ్ అమిన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 14, 2020 | 6:03 PM

BCCI appoints Hemang Amin as Interim CEO :  కొవిడ్ సంక్షోభ సమయంలోనూ భారత క్రికెట్​ బోర్డు (BCCI) కీలకపదవిలో మార్పులు చోటు చేసుకున్నాయి. బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్​ అమిన్​ను నియమించింది. ఐపీఎల్​ సీఈఓగా పనిచేసిన అమిన్​.. గతేడాది మెగాటోర్నీ ప్రారంభోత్సవ వేడుక రద్దు చేసి దానికయ్యే ఖర్చును పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన 40 మంది సైనిక కుటుంబాలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాటి అమలులోనూ కీలకపాత్ర పోషించారు.

ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న జోహ్రి రాజీనామా చేశారు. ఈ మెయిల్​ ద్వారా తన రాజీనామా లేఖ బీసీసీఐకి పంపించారు. ఆయన రాజీనామాను  బోర్డు ఆమోదించింది. తాత్కాలిక సీఈవోగా హేమంగ్​ అమిన్​ను నియమించింది.

జోహ్రి 2016లో బీసీసీఐకి తొలి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ గతేడాది నిష్క్రమించడం.., గంగూలీ నేతృత్వంలో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో పదవి నుంచి తప్పుకోవాలని జోహ్రి నిర్ణయించుకున్నారు. అనంతరం కొన్ని నెలల తర్వాత, గత వారం తన రాజీనామాను సమర్పించారు.