Big Boss winner: రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి.. అసలా రాత్రి ఏం జరిగింది?

|

Mar 06, 2020 | 4:53 PM

తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై మార్చి 4 రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో జరిగిన దాడికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దాంతో రాహుల్ స్వయంగా...

Big Boss winner: రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి.. అసలా రాత్రి ఏం జరిగింది?
Follow us on

Secret behind attack on Big boss 3 winner Rahul Sipliganj: తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై మార్చి 4 రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో జరిగిన దాడికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దాంతో రాహుల్ స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ జోక్యం కోరారు. పబ్‌లో తనపై జరిగిన దాడిలో బాధ్యులను శిక్షించాలని రాహుల్ సిప్లిగంజ్ కేటీఆర్‌ను కోరారు. తనదేమైనా తప్పుంటే తనను శిక్షించమని అర్థించాడు.

మార్చి నాలుగు అర్ధరాత్రి పబ్‌లో తన స్నేహితులతో సరదాగా గడుపుతున్న రాహుల్ సిప్లిగంజ్‌పై టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల చేరిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి బ్యాచ్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ దాడిలో తన సోదరుడు లేడని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెబుతున్నారు. కానీ.. రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి డాన్స్ చేస్తున్న అమ్మాయిలను రితేశ్ రెడ్డి, ఆయన స్నేహితులు కామెంట్ చేయడం వల్లనే గొడవ మొదలైందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఒకటి శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

పబ్ డాన్స్ ఫ్లోర్ మధ్యలో రాహుల్, ఆయన ఫ్రెండ్స్ డాన్స్ చేస్తుండగా.. వారి చుట్టూ తిరుగుతున్న ఓ గ్యాంగ్ ఏదో అనడంతో రాహుల్ వారిని నిలదీయడంతోనే గొడవ మొదలైనట్లు వీడియోలో స్పష్టం గా కనిపిస్తోంది. తన ఫ్రెండ్స్‌ని కామెంట్ చేయడంతో తాను నిలదీశానని, దాంతో వారు మూకుమ్మడిగా దాడి చేశారంటూ రాహుల్ చెబుతున్న మాటలు తాజా వీడియో ద్వారా నిర్దారణ అవుతున్నాయి. ఈ తాజా వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే రాహుల్ సిప్లిగంజ్.. తనపై జరిగిన దాడి కేసులో జోక్యం చేసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ నుద్దేశించి ట్వీట్ చేశారు.

తనపై గానీ.. మరే ఇతర సామాన్యునిపైగానీ ఇలాంటి రాజకీయ పలుకుబడి వున్న వారు దాడి చేయడం ఎంత వరకు సమంజసమని రాహుల్ … తన ట్వీట్‌లో కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఘటనలో తన తప్పుంటే తనపై చర్య తీసుకోవాలని, లేకపోతే.. బాధ్యులను శిక్షించేలా చొరవ చూపాలని రాహుల్ సిప్లిగంజ్ తన ట్వీట్‌లో కేటీఆర్‌ను కోరారు. తాజా వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టినట్లు సమాచారం.