విషాదం.. 130 మందితో వెళ్తున్న రోహింగ్యాల పడవ మునక..

| Edited By:

Feb 12, 2020 | 4:31 AM

బంగ్లాదేశ్‌ మార్టిన్ దీవుల్లో విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యాలతో ప్రయాణిస్తున్న ఓ పడవ.. సముంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. వెంటరే సముద్ర తీర ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పడవ నిర్వాహకులు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతోనే.. ఈ ఘటన జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికార ప్రతినిధి హమీదుల్‌ ఇస్లామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ […]

విషాదం.. 130 మందితో వెళ్తున్న రోహింగ్యాల పడవ మునక..
Follow us on

బంగ్లాదేశ్‌ మార్టిన్ దీవుల్లో విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యాలతో ప్రయాణిస్తున్న ఓ పడవ.. సముంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. వెంటరే సముద్ర తీర ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పడవ నిర్వాహకులు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతోనే.. ఈ ఘటన జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికార ప్రతినిధి హమీదుల్‌ ఇస్లామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ దక్షిణ తీర ప్రాంతం నుంచి..మలేషియా బయల్దేరిన రోహింగ్యా శరణార్థుల పడవ.. మార్టిన్ దీవుల సమీపంలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 130 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా మహిళ లు, చిన్నారులు ఉన్నారని.. సముద్రంలో 15 మృతదేహాలను వెలికితీశామన్నారు. సమాచారం అందుకున్న వెంటనే.. గజ ఈతగాళ్ల సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పడవ మునక ఘటనపై అంతర్జాతీయ శరణార్థి సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.