కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..

| Edited By:

Jul 15, 2020 | 2:54 PM

అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 22 అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు...

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..
Follow us on

అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 22 అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది జగన్ సర్కార్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లా ఏర్పాటు ఉండబోతుంది.

కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లా ఏర్పాటకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే వైఎస్సార్ చేయూత పథకం అమలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం పథకంపై కేబినెట్ చర్చింది.

అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. అరకు ప్రాంతం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచనలు చేశారు.

Read More:

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..

తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్‌తో.. వెబ్ సిరీస్‌లోకి హీరో సూర్య..