ఏ2 విజయసాయిరెడ్డి కోర్టులను విమర్శించడమా.! : రాజేంద్రప్రసాద్

|

Sep 20, 2020 | 7:47 PM

వైసీపీ ప్రభుత్వ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి.? అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కోర్టులను విమర్శించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారని అహంభావంతో ఏది మాట్లాడినా చెల్లుతుందా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి నీతిపరుడైతే తన అవినీతి కేసులను త్వరగా విచారణ చేయాలని అడగాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్డీబీ నిధులతో చేసే పనుల్లో కొందరికే టెండర్లు దక్కేలా చేసుకున్నారని ఆయన చెప్పారు. […]

ఏ2 విజయసాయిరెడ్డి కోర్టులను విమర్శించడమా.! : రాజేంద్రప్రసాద్
Follow us on

వైసీపీ ప్రభుత్వ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి.? అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కోర్టులను విమర్శించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారని అహంభావంతో ఏది మాట్లాడినా చెల్లుతుందా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి నీతిపరుడైతే తన అవినీతి కేసులను త్వరగా విచారణ చేయాలని అడగాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్డీబీ నిధులతో చేసే పనుల్లో కొందరికే టెండర్లు దక్కేలా చేసుకున్నారని ఆయన చెప్పారు. అచ్చెన్నాయడును కావాలనే ఈఎస్ ఐ కేసులో అరెస్టు చేసి 73 రోజులు జైల్లో ఉంచారని.. ఇదే కేసులో ఏ3 గా ఉన్న ప్రమోద్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన నిలదీశారు. నీటి కుంటల్లో, ఆవభూముల్లో పేదలకు స్థలాలు కేటాయించారు, ఇదేమి విధానమని ప్రశ్నిస్తే కోర్టులను విమర్శిస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.