ఏపీ ప్రజలకు సూపర్ యాప్ ‘ఏపీ పోలీస్‌ సేవ’

|

Sep 21, 2020 | 12:11 PM

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం సరికొత్త యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ బాధితులు స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ఈ యాప్ రూపొందించారు. ప్రజలు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’ పేరిట ఈ యాప్‌‌ నేడు అందుబాటులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల  సేవలను ఇంటిదగ్గరే ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు.. ఫిర్యాదులకు రశీదు కూడా పొందే […]

ఏపీ ప్రజలకు సూపర్ యాప్ ‘ఏపీ పోలీస్‌ సేవ’
Follow us on

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం సరికొత్త యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ బాధితులు స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ఈ యాప్ రూపొందించారు. ప్రజలు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’ పేరిట ఈ యాప్‌‌ నేడు అందుబాటులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల  సేవలను ఇంటిదగ్గరే ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు.. ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా యాప్ తయారు చేశారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని భావిస్తున్న ఈ ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంచెంసేపటిక్రితం లాంచ్ చేశారు.