రేపు తీరం దాటనున్న ఉమ్‌ఫున్… బీభత్సం ఎక్కడంటే..?

|

May 19, 2020 | 4:45 PM

బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేస్తూ దూసుకొస్తున్న ఉమ్‌ఫున్ తుఫాను బుధవారం (మే 20) సాయంత్రం తీరం దాటనున్నట్లు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

రేపు తీరం దాటనున్న ఉమ్‌ఫున్... బీభత్సం ఎక్కడంటే..?
Follow us on

Amphan severe cyclone to cross coast on May 20th:  బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేస్తూ దూసుకొస్తున్న ఉమ్‌ఫున్ తుఫాను బుధవారం (మే 20) సాయంత్రం తీరం దాటనున్నట్లు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉమ్ పున్ పెను తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 480 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ నైరుతిగా 630 కిలోమీటర్ల దూర౦లో కేంద్రీకృత౦ అయివుంది. తుఫాన్ కేంద్రీకృతమై ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది.

20వ తేది సాయంత్రానికి వెస్ట్ బెంగాల్లోని సుందర్ బన్స్ దగ్గర ఉమ్‌ఫున్ పెను తుఫాను తీరం దాటే అవకాశం వుంది. రాగల 24 గంటలలో అంటే మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం దాకా ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఏపీ తీరంలోని ఓడ రేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.