రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్ – 21

| Edited By:

Mar 08, 2019 | 4:18 PM

జైపూర్ : రాజస్థాన్‌లోని బికనీర్‌లో మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ ట్రయల్స్‌లో భాగంగా పైకి ఎగిరిన మిగ్ 21న విమానం.. కాసేపటికే కూలినట్టు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పైలెట్ సురక్షితంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయి. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నాయి. ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యకాలంలో […]

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్ - 21
Follow us on

జైపూర్ : రాజస్థాన్‌లోని బికనీర్‌లో మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ ట్రయల్స్‌లో భాగంగా పైకి ఎగిరిన మిగ్ 21న విమానం.. కాసేపటికే కూలినట్టు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పైలెట్ సురక్షితంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయి. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నాయి. ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యకాలంలో యుద్ధ విమానాలు వరుసగా కూలుతున్నాయి. ఫిబ్రవరి 27న మిగ్ 17 హెలికాప్టర్ జమ్మూకాశ్మీర్‌లో కూలిపోయింది. ఆ ఘటనలో ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 1న బెంగళూరులో మిరాజ్ 2000 జెట్ కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు. 2018 సెప్టెంబర్ 4న మిగ్ 27 కూలింది. దీంతో వరుస ఘటనలు ఎయిర్ ఫోర్స్ వర్గాలను కలవరపెడుతున్నాయి.