AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్ – 21

జైపూర్ : రాజస్థాన్‌లోని బికనీర్‌లో మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ ట్రయల్స్‌లో భాగంగా పైకి ఎగిరిన మిగ్ 21న విమానం.. కాసేపటికే కూలినట్టు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పైలెట్ సురక్షితంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయి. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నాయి. ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యకాలంలో […]

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్ - 21
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 08, 2019 | 4:18 PM

Share

జైపూర్ : రాజస్థాన్‌లోని బికనీర్‌లో మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ ట్రయల్స్‌లో భాగంగా పైకి ఎగిరిన మిగ్ 21న విమానం.. కాసేపటికే కూలినట్టు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పైలెట్ సురక్షితంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయి. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నాయి. ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యకాలంలో యుద్ధ విమానాలు వరుసగా కూలుతున్నాయి. ఫిబ్రవరి 27న మిగ్ 17 హెలికాప్టర్ జమ్మూకాశ్మీర్‌లో కూలిపోయింది. ఆ ఘటనలో ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 1న బెంగళూరులో మిరాజ్ 2000 జెట్ కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు. 2018 సెప్టెంబర్ 4న మిగ్ 27 కూలింది. దీంతో వరుస ఘటనలు ఎయిర్ ఫోర్స్ వర్గాలను కలవరపెడుతున్నాయి.

Follow Us
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు