ఆర్మీ, నేవీ చీఫ్‌లకు జడ్‌+ భద్రత

న్యూడిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వాయు, నావికా దళాల అధిపతులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. ఇప్పటికే ఆర్మీ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత ఉంది. భారత ఐఏఎఫ్ చీఫ్ బీరేంద్ర సింగ్‌ ధనోవా, నావికా దళాధిపతి సునీల్‌ లాంబాకు కూడా జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తక్షణం అమలు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. […]

ఆర్మీ, నేవీ చీఫ్‌లకు జడ్‌+ భద్రత

Updated on: Mar 02, 2019 | 1:55 PM

న్యూడిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వాయు, నావికా దళాల అధిపతులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. ఇప్పటికే ఆర్మీ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత ఉంది. భారత ఐఏఎఫ్ చీఫ్ బీరేంద్ర సింగ్‌ ధనోవా, నావికా దళాధిపతి సునీల్‌ లాంబాకు కూడా జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తక్షణం అమలు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు తమకు అందాయని, వెంటనే వారి భద్రతను జడ్‌ ప్లస్‌కు పెంచుతామని దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. జడ్‌ ప్లస్‌ సెక్యురిటీ అనేది దేశంలోనే అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థ.