రష్యాలో ఏడు లక్షలకు చేరువలో కరోనా కేసులు..

| Edited By:

Jul 06, 2020 | 5:38 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే కోటికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. గత కొద్ది రోజులుగా రోజు లక్షల్లో కరోనా పాజిటివ్..

రష్యాలో ఏడు లక్షలకు చేరువలో కరోనా కేసులు..
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే కోటికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. గత కొద్ది రోజులుగా రోజు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమమారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇక ప్రపంచ దేశాల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్‌ రష్యా,భారత్‌లలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రష్యాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువయ్యాయి. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో 6,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రష్యాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,87,862కి చేరింది. ఈ విషయాన్ని రష్యన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులు మొత్తం 85 రీజియన్స్‌ నుంచి నమోదయ్యాయని.. అందులో దాదాపు 1,907 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ఇక రష్యాలో ఇప్పటి వరకు కరోనా బారినపడి పది వేల మందికి పైగా మరణించారు.