కార్గిల్‌లో భూకంపం.. వణికిపోతున్న ప్రజలు..

ఓ వైపు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా ఇదే సమయంలో భయబ్రాంతుకుల గురిచేస్తోంది. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, వర్షాలు, వరదలతో..

కార్గిల్‌లో భూకంపం.. వణికిపోతున్న ప్రజలు..

Edited By:

Updated on: Jul 02, 2020 | 4:13 PM

ఓ వైపు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా ఇదే సమయంలో భయబ్రాంతుకుల గురిచేస్తోంది. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, వర్షాలు, వరదలతో ప్రజలంతా వణికిపోతున్నారు. తాజాగా.. గురువారం నాడు లదాఖ్‌లోని కార్గిల్‌ ప్రాంతంలో భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. కార్గిల్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.11 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కార్గిల్‌కు ఈశాన్య దిశగా 119 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ.. ఆస్తి నష్టం కానీ సంభవించలేదని అధికారులు తెలిపారు.