దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే… మరోవైపు అనుకూలంగా కూడా ర్యాలీలు చేపట్టారు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో బుధవారం సాయంత్రి నాటికి 27 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు ట్రబుల్ షూటర్.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఆయన స్వయంగా పర్యటిస్తూ.. అక్కడి వారిని అడిగి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగా ఉందని.. త్వరలోనే మాములు పరిస్థితి నెలకొంటుందని.. బాధ్యతా యుతంగా ఉన్న వ్యవహరిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.