ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కరోనా టెన్షన్.. తాజాగా 102 కేసులు..

మొన్నటి వరకు అత్యల్పంగా ఉన్న ఉత్తరాఖండ్‌ కరోనా కేసుల సంఖ్య.. అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజాగా శుక్రవారం నాడు.. 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 602కు చేరింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసుల్లో ప్రస్తుతం 505 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి ఐదుగురు మరణించారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 89 […]

ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కరోనా టెన్షన్.. తాజాగా 102 కేసులు..

Edited By:

Updated on: May 29, 2020 | 7:08 PM

మొన్నటి వరకు అత్యల్పంగా ఉన్న ఉత్తరాఖండ్‌ కరోనా కేసుల సంఖ్య.. అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజాగా శుక్రవారం నాడు.. 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 602కు చేరింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసుల్లో ప్రస్తుతం 505 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి ఐదుగురు మరణించారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 89 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా శుక్రవారం నాడు.. 1439 మంది శాంపిల్స్‌ను పంపించగా.. మొత్తం 4,578 శాంపిల్స్‌ రిపోర్టు రావాల్సి ఉందని.. అధికారులు పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వాటిలో 89వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక 71వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4,706కు చేరింది.