Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

ఆ 3 కాలేజీలకు ఇంటర్ బోర్డ్ షాక్.. ఎందుకంటే ?

inter board shocks 3 institutions, ఆ 3 కాలేజీలకు ఇంటర్ బోర్డ్ షాక్.. ఎందుకంటే ?

తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చొచ్చుకుపోయిన విద్యాసంస్థలకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు షాకిచ్చారు. అయితే ఇది వారు నిబంధనలకు అనుగుణంగా క్యాంపస్‌లను నడుపుతున్నందుకు కాదు. మరేంటా రీజన్.. ఏంటా షాక్ అనుకుంటున్నారా ? ఈ స్టోరీ చదవండి..

ఆర్టీసీ సమ్మె తెలంగాణలో జనజీవనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొండికేస్తున్న కార్మిక సంఘాలను దారిలోకి తెచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ప్రజల ఇబ్బందులను నివారించేందుకు యధాశక్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది కెసీఆర్ ప్రభుత్వం. అయితే.. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. ఆర్టీసీ పూర్తి స్థాయిలో నడిచినంతగా ప్రత్యామ్నాయ వసతులు సరిపోవడం లేదు. దాంతో విద్యార్థుల ఇబ్బందులను అరికట్టేందుకు అక్టోబర్ 19వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులను పొడిగించింది.

దాంతో పాఠశాలలన్నీ సెలవులను పొడిగిస్తూ విద్యార్థులకు సందేశాలు పంపాయి. అయితే.. కాలేజీలు ముఖ్యంగా తెలంగాణలో విపరీతంగా విస్తరించిన కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రీ విద్యాసంస్థలు మాత్రం తమ క్యాంపస్‌లలో తరగతులను ఈనెల 15న ప్రారంభించాయి. అయితే ఆ రోజున విద్యార్థులు తరగతి గదుల్లో వుండగానే.. పలు విద్యార్థి సంఘాలు కాలేజీలను ముట్టడించాయి. విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశాయి.

కానీ, ఈ మూడు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు  శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రీ విద్యాసంస్థలకు చెందిన 15 క్యాంపస్‌లలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.జయప్రదా బాయి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు  జరిగాయి. తరగతులు నిర్వహిస్తున్న విషయం గుర్తించి 3 కాలేజీల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు అధికారులు.

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే.. కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు.. పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అధికారుల ఆగ్రహంతో స్పందించిన 3 కాలేజీల యాజమాన్యాలు సాధారణ తరగతులను మాత్రం రద్దు చేసి… ఎలైట్ బ్యాచ్‌ విద్యార్థులకు రహస్యంగా తరగతులు నిర్వహిస్తుండడం విశేషం. సాధారణ బ్యాచ్ విద్యార్థులకు క్లాసులు జరగకుండా అడ్డుకున్న ఇంటర్ బోర్డు అధికారులు ఎలైట్ బ్యాచ్ పేరిట నిర్వహిస్తున్న తరగతులపై ఫోకస్ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.