బిగ్‌బాస్ హౌస్‌లో టామ్ అండ్ జెర్రీల ఫైట్ కొనసాగుతోంది. అరియానా, సోహైల్ మధ్య చింటూ విషయంలో జరిగిన గొడవ తాజాగా జరిగిన ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. ‘‘నిన్ను అరియానా తీసుకెళ్లలేదా? నువ్వు వట్టి ఎమోషనల్.. అనవసరంగా మోసపోతున్నావు రా’’ అని బొమ్మతో కబుర్లు పెట్టాడు సోహైల్. ఇంతలోనే ఈ గొడకు మూల కారణం చింటూ అని గుర్తొచ్చిందో ఏమో చింటూగాడిని చంపేస్తానంటూ ఆ బొమ్మ బెదిరించాడు. బొమ్మను పాడు చేయాలని ప్రయత్నించగా… మోనాల్ అడ్డుకుంది. అయితే సోహైల్ చేసిన చర్యలు నవ్వు తెప్పించాయి.
తర్వాత సోహైల్ అరియానాతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అవినాష్ లేనప్పుడు అతడి గురించి మాట్లాడటం, తన పైకి దూసుకుంటూ రావడం నచ్చలేదని అరియానా సోహైల్ ముఖం మీదే చెప్పింది. టాస్క్ వల్ల ఈ పంచాయితీ అయిందని, ఇందులో ఇద్దరిదీ తప్పుందని సోహైల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే గొడవకు మాత్రం పరిష్కారం దొరకలేదు. ఆ తర్వాత సోహైల్‌కు అఖిల్‌తో కూడా ఫైట్ అయింది.