Big Boss Season 4: తెలుగు బిగ్‌బాస్ షో ప్రారంభం అయిన దగ్గరి నుంచి వరుసగా అబ్బాయిలే విన్నర్స్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా విన్నర్ కాలేకపోయింది. గత రెండు, మూడు టైటిల్ చివరి వరకు వెళ్ళిన అమ్మాయిలు గీతామాధురి, శ్రీముఖి కేవలం రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. కానీ ఈసారి ఎలాగైన బిగ్‌బాస్ విన్నర్ అవ్వాలని గట్టి సంకల్పంతో హౌస్‌లోకి అడుగు పెట్టింది అరియానా. ఇంట్లో ఇప్పటి వరకు అబ్బాయిలకు సమానంగా తన ప్రదర్శన ఇస్తూ వస్తుంది. ప్రతి టాస్క్‌లో తన ప్రతిభను చూపించుకుంటుంది. తాజాగా రాజారాణి టాస్క్‌లో కూడా బెస్ట్ రాణిగా ఎంపికైయ్యింది.
ఇక నిన్నటి ఓపిక టాస్క్‌లోనూ తన వస్తువులు పాడుచెస్తున్నా.. తనకు ఎంతో ఇష్టమైన చింటూ బొమ్మను పాడు చేస్తూన్న చలనం లేకుండా, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా విగ్రహంలా ఉండిపోయింది. టాస్క్ పూర్తైన తర్వాతే తన బాధను బయటకు చెప్పింది. ఆ తర్వాత సోహైల్‌కు అరియానాకు మధ్య తీవ్రస్థాయి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే బిగ్‌బాస్ చివరి దశకు రావడంతో ఎవరి అభిమానులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌ను గెలిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అరియానా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ కంటెస్టెంట్‌ను గెలిపించాలని ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అరియానాకు అండగా నిలబడ్డారు. అరియానాకు ఓటేసి గెలిపించాలని ట్వీట్ చేశారు. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు అరియానాకే అర్హత ఉందని తెల్చీ చెప్పారు. దీంతో అరియానాకు ఆర్జీవీ సపోర్టు దొరకడంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అటు అరియానా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక తనతో సినిమా తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే.
VOTE and MAKE ARIYANA WIN ..TRULY DESERVING in BIG BOSS ???https://t.co/EnzmWOZkCP pic.twitter.com/hbS5QCXjDK
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2020