Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయింది. 106 రోజుల పాటు ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచిపెట్టింది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు టైటిల్ ట్రోఫీ కోసం పోటీపడగా.. చివరికి అభిజిత్ విన్నర్‌గా నిలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. ఫినాలే ఎపిసోడ్‌కు రెండు రోజుల ముందు మెహబూబ్ సోహైల్‌తో చేసిన సైగలే విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సోహైల్ నెంబర్ 3లో ఉన్నట్లు మూడు వేళ్లతో సూచించడమే కాకుండా.. డబ్బుల ఆఫర్ వస్తే వదిలిపెట్టొదని మెహబూబ్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఫ్రెండ్ చెప్పినట్లుగానే సోహైల్ ఫైనల్ ఎపిసోడ్‌లో రూ. 25 లక్షలు తీసుకుని బయటికి వచ్చాడని.. తద్వారా విన్నర్ ప్రైజ్ మనీలో కోత పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోహైల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో వివరణ కూడా ఇచ్చాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ అంశంపై బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు.
”నా దృష్టికి కూడా మెహబూబ్ విషయం వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ విషయాన్ని నేను భూతద్దంలో పెట్టి చూద్దామనుకోవడం లేదు. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే ‘స్టార్ మా’ వాళ్లు చూసుకుంటారు. నేను ప్రైజ్ మనీ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. బిగ్ బాస్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. అది చాలు నాకు. ఎంతోమంది ప్రేక్షకులకు చేరువ అయ్యాను” అంటూ అభిజిత్ హుందాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:
యాంటీ బయోటిక్స్ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట
‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్