బిగ్ బాస్ సీజన్ 4 చివరకు వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. మిగిలిన ఇంటిసభ్యుల్లో ఎవరు విజేత అవుతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న(శనివారం) రోజున నాగార్జున హౌస్ మేట్స్ కు పెద్ద క్లాసే తీసుకున్నడు. వారంరోజులుగా హౌస్ లో జరిగిన రచ్చ గురించి తప్పొప్పులను అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఇంటి సభ్యులతో నాగార్జున సందడి చేశారు. ఇందుకు సంబందించిన ప్రోమోను తాజాగా విడుదలచేశారు.
13వ వారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మోనాలా లేక అవినాషా అన్నదానిపై స్పష్టత రాలేదు. అయితే ప్రతిసారీ సింపథీ గేమ్ ఆడుతూ.. చిన్న విషయాన్ని పెద్దది చేసి రచ్చచేయడంతో ఈ సారి అవినాష్‌కు ఓట్లు తక్కువ పడ్డాయని తెలుస్తుంది. దాంతో అవినాష్ ఇంటినుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా హౌస్ మేట్స్ అంతా డ్యాన్స్ లతో అదరగొట్టారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కామధేనువును అంబా అని అరిచేలా చేయాలని నాగార్జున చెప్పాడు. దాంతో హారికా, మోనాల్, అవినాష్, అభిజీత్ లు కాంధేనువుతో అంబా అనిపించే ప్రయత్నం చేసారు. వీరిలో అవినాష్ ఏకంగా ఆవు కాళ్ళమీదపడ్డడు, కాళ్లుపట్టుకొన్ని సేవ్ చేయమని ప్రాధేయపడ్డాడు. మరి హౌస్ లో ఉంచిన కామదేన్బువు ఎవరిని కనికరించిందో ఈ రోజు ఎపిసోడ్ లో తేలనుంది