బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్..!

|

Sep 13, 2020 | 5:48 PM

కరోనా విరామం తర్వాత 16 మంది కంటెస్టెంట్ల‌తో బిగ్‌బాస్ 4 అట్టహాసంగా ప్రారంభమైంది. ఏడుపులు, పెడబొబ్బలు, వాగ్వాదాలు, చిన్న రొమాంటిక్ మూమెంట్స్.. ఇలా చూస్తుండగానే తొలి వారం చివరికి వచ్చేసింది.

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్..!
Follow us on

Bigg Boss 4 Telugu: కరోనా విరామం తర్వాత 16 మంది కంటెస్టెంట్ల‌తో బిగ్‌బాస్ 4 అట్టహాసంగా ప్రారంభమైంది. ఏడుపులు, పెడబొబ్బలు, వాగ్వాదాలు, చిన్న రొమాంటిక్ మూమెంట్స్.. ఇలా చూస్తుండగానే తొలి వారం చివరికి వచ్చేసింది. గంగవ్వ, అభిజిత్, అఖిల్, సుజాత, సూర్యకిరణ్, మెహబూబ్, దివిలు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్‌కు నామినేట్ కాగా.. వారిలో ఇప్పటికే గంగవ్వ, సుజాత, అభిజిత్‌లు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు నాగార్జున నిన్నటి ఎపిసోడ్‌లో అధికారికంగా ప్రకటించాడు. ఇక ఇవాళ తొలి వారం ఎలిమినేట్ ఎవరవుతారన్నది మరికాసేపట్లో తేలిపోతుంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం బుల్లితెర యాంకర్ లాస్య మంజునాథ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా ఎంపికైన లాస్య రోజుకు రూ. 1 లక్ష అందుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఈమెదే అత్యధిక రెమ్యునరేషన్ అని వినికిడి.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున హౌస్‌మేట్స్ అందరికీ క్లాస్ తీసుకున్నాడు. ”మీకు కనెక్షన్స్ పెట్టి.. ఒకరి గురించి మరొకరు తెలుసుకోండి అని చెబితే.. లేని కట్టప్ప గురించి ఎక్కువ ఊహించుకుని.. అందరూ హడావుడి చేశారని’ చెప్పుకొచ్చాడు. కరాటే కళ్యాణి, నోయెల్‌ను ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలని చెప్పిన నాగ్.. సూర్యకిరణ్‌ను లిమిట్‌లో ఉండాలన్నాడు. అటు అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు వేస్తున్నాడని.. దివిని ‘సైలెంట్ కిల్లర్’ అని నాగార్జున అభివర్ణించాడు . ఇక ఎప్పటిలానే ఈ బిగ్ బాస్ హౌస్‌కు గంగవ్వ వెరీ వెరీ స్పెషల్ అని కొనియాడాడు.