
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే వేదికగా కంటెస్టెంట్లపై వరాలు కురిపించారు. బిగ్‌బాస్‌లో ప్రతిభ కనబరిచిన కంటెస్టెంట్లను ప్రోత్సహిస్తామని కోట్లాది ప్రేక్షకుల సాక్షిగా ప్రకటించారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో తాము ముందుంటామని చిరు, నాగ్ మరోసారి నిరూపించారు.
బిగ్‌బాస్‌లో 3 పొజిషన్‌లో నిలిచిన సోహైల్ పంట పండిందనే చెప్పాలి. బిగ్‌బాస్ ఇంటి నుంచి సెకండ్ రన్నరప్‌గా వేదిక మీదకు వచ్చిన సోహైల్‌ను ఏం కావాలో కోరుకోమని అడిగారు చిరంజీవి. దానికి అతడు తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాలని చిరును ఆహ్వానించాడు. అయితే చిరంజీవి మాత్రం ఏకంగా అతడి సినిమాలో నటిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా తీసుకుంటానని అన్నారు. ఇక మరో కంటెస్టెంట్ దివికి తన నెక్స్ట్ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తున్నట్లు చిరు ప్రకటించారు.
కాగా షోలో సోహైల్ 25 లక్షలు బహుమతిగా గెలుచుకోగా… 10 అనాథశ్రమానికి, 15 లక్షలు తానుకు కావాలని అన్నాడు. తర్వాత స్టేజీ మీదకు వచ్చాక మెహబూబ్‌కు 5 లక్షలు ఇళ్లు కట్టుకునేందుకు ఇస్తా అన్నాడు. దీంతో మెహబూబ్ తనకు ఆ 5 లక్షలు వద్దని వారించాడు. తన తరఫున ఆ 5 లక్షలు అనాథశ్రమానికి ఇవ్వాలని సోహైల్‌కు మెహబూబ్ సూచించాడు. అయితే సోహైల్ గెలుచుకున్న మొత్తాన్ని అతడి కోసమే వాడుకోవాలని నాగ్ సూచించారు. అతడు దానం చేద్దామనుకున్న పది లక్షలను తన జేబులో నుంచి ఇస్తానని నాగ్ ప్రకటించారు.
మెహబూబ్ గురించి బిగ్‌బాస్ వేదికగా చిరు ప్రత్యేకంగా మాట్లాడారు. అతడిని చూస్తుంటే చిన్నప్పుడు తనను తాను చూసుకున్నట్లుంది అని చిరంజీవి అన్నారు. సినిమాల్లోకి రావాలని నా చిన్నప్పుడు ఎలా తపన చెందానో అది మెహబూబ్‌లో కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కలగజేసుకుని సోహైల్ గెలుచుకున్న డబ్బు గురించి ప్రస్తావించారు.
‘సోహైల్ అందుకున్న 25 లక్షల రూపాయల్లో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. అయితే మెహబూబ్ మాత్రం దాన్ని తిరస్కరించాడు. తనకివ్వాలనుకున్నదాన్ని కూడా అనాథశ్రమానికి ఇచ్చేయమని సూచించాడు’ అని వివరించారు. దీంతో చిరంజీవి మెహబూబ్‌కు అవసరమయ్యే డబ్బు నేనిస్తాను అంటూ స్టేజీ మీదనే రూ.10 లక్షల చెక్ రాసిచ్చారు. మెగాస్టార్ తనకు చెక్ రాసివ్వడాన్ని నమ్మలేకపోయిన మెహబూబ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడ్చుకుంటూ వచ్చి చిరంజీవి కాళ్ల మీద పడ్డాడు. దీంతో చిరంజీవి అతడిని ఓదార్చుతూ.. మీరు కళాకారులయ్యా.. కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదు అంటూ దగ్గరకు చేరదీసి హత్తుకున్నాడు. అతడికి ప్రేమగా ముద్దు పెట్టి పది లక్షల చెక్ ఇచ్చారు.