Suma Wildcard Entry: తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. అందరి ఫేవరెట్, ప్రముఖ యాంకర్ సుమ కనకాల బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో విడుదల అయ్యింది. కరోనా మహమ్మారి చాలా మార్పులు తీసుకొచ్చిందని, అందుకే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లబోతున్నట్లు సుమ వెల్లడించారు. ఇక స్టేజ్ మీద సుమ, నాగార్జునకు పంచుల మీద పంచులు వేశారు. ( బాబాయ్, నేను కలిసి నటించబోతున్నాము.. కన్ఫర్మ్ చేసిన రానా)
అంతేకాదు హౌజ్‌లో ఇప్పుడున్న అందరి గురించి క్షుణ్ణంగా చదివిన సుమ.. వారి సీక్రెట్‌లు కూడా చెప్పేసింది. ఆమె రాక కోసం హౌజ్‌లోని అందరూ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సుమ వైల్డ్ కార్డు ఎంట్రీతో తనకు రానున్న ఐదు వారాలు ఫుల్ ఫన్ ఉంటుందని నాగ్ తెలిపారు. అంతేకాదు సుమను లోపలికి పంపిస్తున్నట్లు కూడా ప్రోమోలో చూపించారు. మరి బయట పలు షోలతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటే సుమ నిజంగానే బిగ్‌బాస్‌లోకి వెళ్లనుందా..? లేక షోలో భాగంగా ఇదొక ఎత్తుగడనా..? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ( కరోనా అప్‌డేట్స్: దేశవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసుల సంఖ్య)