Bigg Boss 4: ప్రతిసారీ గంగవ్వ నిర్ణయమేనా.. సొహైల్ అసంతృప్తి

| Edited By:

Oct 09, 2020 | 9:19 AM

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ ఇస్తోన్న టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Bigg Boss 4: ప్రతిసారీ గంగవ్వ నిర్ణయమేనా.. సొహైల్ అసంతృప్తి
Follow us on

Bigg Boss 4 Sohail: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ ఇస్తోన్న టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గురువారం నాటి ఎపిసోడ్‌లో బీబీ హోటల్ టాస్క్‌ విజేతగా గెస్ట్‌ టీమ్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరువాత గెస్ట్‌ టీమ్‌ ఒక బెస్ట్‌ ప్లేయర్‌ని సెలక్ట్ చేయాలని బిగ్‌బాస్ అడిగాడు.

ఈ సందర్భంగా సొహైల్‌ కాస్త అసహనానికి గురయ్యారు. బెస్ట్ ప్లేయర్‌ని గంగవ్వ సెలక్ట్ చేస్తుందని అనగా.. ”గంగవ్వే ప్రతిదీ చెప్పాలని రూల్ లేదు. ఆమె నిర్ణయాన్ని జడ్జిమెంట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇలాగే అవుతుంది” అని సొహైల్‌ అభ్యంతరం చెప్పాడు. ఈ క్రమంలో గంగవ్వ మెహబూబ్‌కి ఓటేయగా, అరియానా కూడా మెహబూబ్‌ పేరు  చెప్పింది. సొహైల్‌, మెహబూబ్‌ని తనకు సపోర్ట్ చేయమని కోరాడు. ఈ సమయంలో ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు. ‘పోయిన సారి నేను నీకు సపోర్ట్ ఇచ్చాను. ఈసారి నాకు సపోర్ట్ చేస్తే చెయ్యి. లేదంటే లేదు’ అని సొహైల్ తెగేసి చెప్పాడు. మధ్యలో హారిక వచ్చి తాను కూడా సూపర్‌గా ఆడానని అనగా.. అరియానా కూడా ఏ మాత్రం తగ్గకుండా తాను కూడా బెస్ట్ పెర్ఫామర్‌నే అని చెప్పింది. ఇలా సుదీర్ఘ చర్చల అనంతరం సొహైల్ పేరును ఫైనల్ చేశారు.

దీంతో కెప్టెన్సీ టాస్క్‌లో సొహైల్ నిలిచాడు. ఇక అఖిల్ దగ్గర అందరి కంటే ఎక్కువ డబ్బులు ఉండటంతో రెండవ కెప్టెన్సీ పోటీ దారుడిగా అతడు నిలిచాడు. ఆ తరువాత అవినాష్‌కి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విషయాన్ని బిగ్‌బాస్ రివీల్ చేశాడు. ఆ సీక్రెట్‌ టాస్క్‌లో అవినాష్ విజయవంతం అయ్యాడని, మూడో కెప్టెన్సీ దారుడిగా ప్రకటించారు. ఇక వరస్ట్ పెర్ఫార్మర్ పేరు చెప్పమని బిగ్‌బాస్ అడగ్గా.. తానేనని అమ్మ రాజశేఖర్ ఒప్పుకున్నారు. దీంతో ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వాలని బిగ్‌బాస్‌ పనిష్మెంట్‌ ఇచ్చారు.

Read More:

నేడు తెలంగాణలో‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు

Bigg Boss 4: మళ్లీ ఇంటికి పోతానన్న గంగవ్వ