నేడు తెలంగాణలో‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు

నేడు తెలంగాణలో లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి రెండు సెషన్‌లలో 30,310 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

నేడు తెలంగాణలో‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2020 | 8:45 AM

TS LAWCET PGLCET: నేడు తెలంగాణలో లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి రెండు సెషన్‌లలో 30,310 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కాగా టీఎస్ లాసెట్ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు సంబంధించి ఉదయం 10.30 నుంచి ఎల్ 12 మధ్యాహ్నం వరకు పరీక్ష జరగనుంది. అలాగే టీఎస్ లాసెట్‌ 5 సంవత్సరాల డిగ్రీ కోర్సు, టీఎస్‌పీజీఎల్‌ సెట్‌కి మధ్యాహ్నం 3 గంటల నుంచి గం.4.30ల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షల కోసం మొత్తం 67 సెంటర్లను సిద్ధం చేశారు. అందులో తెలంగాణలో 64, ఏపీలో 4 ఉన్నాయి. కాగా మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు 21,295 మంది అభ్యర్థులు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ కోర్సుకు 5,691 మంది, ఎల్‌ఎల్‌ఎంకు 2,691 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

Read More:

Bigg Boss 4: మళ్లీ ఇంటికి పోతానన్న గంగవ్వ

Bigg Boss 4: అభిజిత్‌- హారిక రొమాన్స్‌‌.. ఒంటరిగా ఏడ్చేసిన అఖిల్‌

Latest Articles