Bigg Boss 4 Telugu: అనారోగ్య కారణాలతో చికిత్స కోసం నోయల్ బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక శనివారం ఎపిసోడ్‌లో నోయల్‌కి ప్రాపర్ సెండాఫ్ ఇచ్చేందుకు నాగార్జున స్టేజ్ మీదకు తీసుకువచ్చారు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు రేలంగి మామయ్య అని పేరు తెచ్చుకున్న నోయల్.. స్టేజ్‌పై మాత్రం తన బాధనంతా కక్కేశారు. ముఖ్యంగా తన ఆరోగ్యంపై అమ్మ రాజశేఖర్, అవినాష్ చేసిన కామెడీలను బయటపెట్టి, అవి తనను ఎంత బాధపెట్టాయో చెబుతూ వారికి పెద్ద క్లాస్ పీకాడు. ( Breaking: కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత)
ఆ ఇద్దరిని ఒంటికాలుపై నిల్చోమని చెప్పిన నోయల్.. కాళ్లు నొప్పులు పెట్టాయా..? అని అడిగారు. దానికి వారిద్దరు అవునని చెప్పగా.. ఇంతకన్నా వెయ్యి రెట్ల ఎక్కువ నొప్పిని నేను ప్రతిరోజు అనుభవిస్తూ వచ్చానని చెప్పారు. “నాకు ఆంక్లియోస్పాటిలైసిస్ ఉంది. పొద్దున లేచాక అరగంట పాటు కాళ్లు స్ట్రెచ్ చేసుకుంటేనే నడగలను. కాని దాన్ని మీరిద్దరూ జోక్ చేస్తారేంటి?” అని నిలదీశాడు. తాను ఎలా నడిచానో చూపిస్తూ అవినాష్ ఎగతాళి చేశాడని నోయల్ బాధపడ్డాడు. కానీ అతడి కాలికి దెబ్బ తగిలినప్పుడు తాను కట్టు కట్టానని నోయల్ గుర్తు చేశాడు. ( RCB vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం)
దీంతో అవినాష్ ఫైర్ అయ్యాడు. బయటికి వెళ్లాక మీరు కావాలని ఇద్దరినీ బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డాడు. చిల్లర కామెడీ అయితే ఇక్కడి వరకు వస్తానా? అని ఆవేశపడగా.. ఇవి తగ్గించుకుంటే మంచిదని నోయల్ సమాధానమిచ్చాడు. అలా అయితే ఇన్నిరోజులు నువ్వు నటించావంటూ అవినాష్, నోయల్‌ని తప్పు పట్టాడు. మిమిక్రీని తప్పుపడుతున్నావు, కళామతల్లిని అవమానిస్తున్నావు అంటూ అవినాష్ ఏవేవో మాట్లాడాడు. కానీ చివరికు మోకాళ్లపై మోకరిల్లి రెండు చేతులు జోడించి నోయల్‌కి సారీ చెప్పాడు. తప్పు చేసి సారీ చెప్పడం పెద్దరికం కాదంటూ నోయల్ గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత లాస్య సేఫ్ అయినట్లు నోయల్ ప్రకటించారు. చివరగా ర్యాప్ సాంగ్ పాడగా.. హౌజ్‌లోని అందరూ ఎంజాయ్ చేశారు. కానీ అమ్మ రాజశేఖర్, అవినాష్ మాత్రం అలానే కూర్చున్నారు. ఇక నోయల్ బిగ్‌బాస్, నాగార్జున వద్ద నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ( IPL 2020, RCB vs SRH : బెంగళూరుతో హైదరాబాద్ ఘనవిజయం)