Bigg Boss 4 Nagarjuna: బిగ్‌బాస్ 4లో వారాంతం ఎపిసోడ్ వ్యాఖ్యతపై సస్పెన్స్ వీడింది. వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం గత వారం నాగార్జున హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లారు. దీంతో గత ఆదివారం ఎపిసోడ్‌కి నాగ్ కోడలు, నటి సమంత వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఇక ఈ వారం కూడా నాగ్ అక్కడే ఉండటంతో ఎవరు వస్తారోనన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో పలువురి పేర్లు కూడా వినిపించాయి. ( బీజేపీలో చేరిన గద్దె బాబూరావు)
అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ కింగ్ నాగార్జున బ్యాక్ వచ్చేశారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నాగార్జున హైదరాబాద్ వచ్చేశారు. దానికి సంబంధించిన వీడియోను స్టార్ మా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ( సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)
King is back in style for #BiggBossTelugu4 shoot
Today at 9 PM on @StarMaa pic.twitter.com/loFBC2WJHt
— starmaa (@StarMaa) October 31, 2020