Bigg Boss 4 Monal: వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున, ఇంటి సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హౌజ్‌లో నడుస్తోన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీపై చర్చ మొదలైంది. అభిజిత్ తనతో మాట్లాడటం లేదని అతడిని బోనులో నిలబెట్టి అడిగింది మోనాల్. ఈ సందర్భంగా అభికి మోనాల్ ఐ లవ్ యు చెప్పిన విషయాన్ని దివి బయటపెట్టింది. అఖిల్ పడుకున్నాక మోనాల్, అభి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అభిపై జోకులు వేసినట్లు దివి వెల్లడించింది.
ఇక ఈ మాటలకు మోనాల్ భోరున ఏడ్చేసింది. దీన్ని ట్రయాంగిల్ చేయకండని, తన క్యారెక్టర్‌ని కించ పరచకండి అని మోనాల్ బాగా ఫీల్ అయ్యింది. అంతేకాదు ఆ రోజు అభిజిత్‌కి ఐ లవ్ యు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించింది.
Read More:
Bigg Boss 4: ఇంగ్లీష్ మాటలు.. ఆ ఇద్దరికి క్లాస్ పీకిన నాగార్జున