Bigg Boss 4 updates: బిగ్‌బాస్ 4 సోమవారం నాటి ఎపిసోడ్‌లో గోంగూర తోట కాడ కాపు కాశా అనే మాస్ పాటకు కంటెస్టెంట్‌లు స్టెప్పులు వేశారు. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతి దీక్షిత్ నవరసాలు నేర్పించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. నవరసాల్లో భాగంగా మొదట శృంగార రసాన్ని చేసి చూపించారు స్వాతి. ఆ రసాన్ని అభిజిత్‌తోనే స్వాతి చేయగా.. వారిద్దరి మధ్య రొమాన్స్ బాగా పండింది. ఇక ఆ తరువాత మిగిలిన రసాలను అద్భతంగా చేసి చూపించారు స్వాతి.
ఇక కోపం రసాన్ని పిండేందుకు రంగంలోకి దిగారు లాస్య, నోయెల్‌లు. వీరిద్దరు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకొని ఆస్కార్ రేంజ్‌లో నటించారు. అయితే ఈ సీన్‌ని ప్రోమోల చూపించడంతో.. హౌజ్‌లో పెద్ద రచ్చ జరిగిందని వీక్షకులు భావించారు. కానీ అదంతా టాస్క్‌లో భాగమని తెలిసిన వీక్షకులు ఉఫ్ మన్నారు.
Read More:
Bigg Boss 4: నామినేషన్‌లో ఏడుగురు.. మర్డర్‌లతో రెచ్చిపోయిన అఖిల్