Bigg Boss 4: మరో ఐదు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. టైటిల్ వేటలో అభిజిత్, సోహైల్, అఖిల్, అరియానా, హారిక.. ఇలా అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండటంతో.. టాప్ 2లో ఎవరు నిలుస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అటు హౌస్‌లో రోజురోజుకూ పరిణామాలు మారుతున్నాయి. ఇక అభిమానులు ఏమో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతూ.. వారి గెలుపు కోసం మిస్డ్ కాల్స్, హాట్ స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ చేసేస్తున్నారు.
ఇదిలా ఉంటే బోల్డ్ బ్యూటీ అరియానా టాప్ 2లో ఉండటానికి అర్హురాలని కొంతమంది వాదన. మొదట్లో ఈమె పెద్దగా అలరించలేకపోయినా.. ఆ తర్వాత టాస్కుల్లో బాయ్స్‌తో పోటీ పడుతూ తన సత్తాను చాటుకుంది. హౌస్‌లో ఉన్న మిగతా ఫిమేల్ కంటెస్టెంట్ల కంటే.. ఈమె కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. నామినేషన్స్‌తో పాటు పలు ఇతరత్రా విషయాల్లో మిగిలిన ఇంటి సభ్యులు ఈమెను టార్గెట్ చేసినా కూడా ఎక్కడ తొణకలేదు… బెణకలేదు.. చివరి వరకు పోరాటం సాగిస్తూనే వచ్చింది. పలు సందర్భాల్లో కంటతడి పెట్టుకున్నా.. ధైర్యం తెచ్చుకుని ముందుకు నడిచింది. అయితే సోహైల్‌తో కొన్ని సార్లు జరిగిన గొడవలు పడి ఓవర్ రియాక్ట్ కావడం, పలు టాస్కుల్లో హద్దు మీరడం వంటివి అరియానాకు మైనస్ పాయింట్లు అయ్యాయి.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కూడా మిగతా ఫైనలిస్టులు అరియానా విజేత కావడానికి అనర్హురాలని తేల్చి చెప్పగా.. దాన్ని కూడా స్పోర్టివ్‌గా తీసుకుని.. ”ఆటలో నా పేరు అందరికీ గుర్తిందిపోవడం మంచిదే. ఇక అందరూ తన పేరును చెబుతున్నారంటే.. ఖచ్చితంగా తాను గేమర్‌నే.. బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు తాను అర్హురాలినని అరియానా పేర్కొంది. అలాగే అబ్బాయిలంతా కలిసి ట్రోఫీ గెల్చుకునేందుకు అనర్హురాలు అమ్మాయిలే అని చెప్పడంతో నెటిజన్లు కూడా అరియానాను విజేతగా నిలిపేందుకు సర్వశక్తులు ఒడ్డిస్తున్నారు.
Also Read: