Bigg Boss 4: సొహైల్‌కి హారిక పంటిగాట్లు

బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈ వారానికి గానూ కొంచె రాక్షసులు- మంచి మనుషులు అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ని కుటుంబ సభ్యులకు ఇచ్చారు.

Bigg Boss 4: సొహైల్‌కి హారిక పంటిగాట్లు

Edited By:

Updated on: Oct 21, 2020 | 8:34 AM

Bigg Boss 4 Sohail: బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈ వారానికి గానూ కొంచె రాక్షసులు- మంచి మనుషులు అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఇందులో భాగంగా రాక్షసుల టీమ్ రెచ్చిపోయింది. ఇక టాస్క్‌లో భాగంగా ప్రమిదలు చేసే సమయంలో రాక్షసుల టీమ్‌ మనుషుల టీమ్‌ని చాలా ఇబ్బందులు పెట్టింది. హారిక, మాస్టర్ దగ్గర ఉన్న ప్రమిదలను లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ హారికను సొహైల్‌ అడ్డుకున్నారు. దీంతో హారిక, సొహైల్‌ ఒకరిపై ఒకరు పడి దొర్లారు. హారిక సొహైల్‌ని కొరకగా.. అతడికి పంటిగాట్లు పడ్డాయి. నొప్పి భరించలేక సొహైల్‌ కేక‌లు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు క‌ష్ట‌ప‌డి మాస్ట‌ర్ ద‌గ్గ‌ర దీపాలు దాచిపెట్ట‌గా మిగిలిన వారు అతడి నుంచి లేపేశారు. అయినా 160 దీపాలు చేసి మనుసుల టీమ్ గెలిచింది.

Read More:

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. ప్రతాపం చూపిన అరియానా, హారిక

ఆన్‌లైన్‌లోనే  ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు