Bigg Boss 4 Telugu: రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్‌లోని కంటెస్టెంట్‌ల రంగు మరింత బయటపడుతోంది. ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయం, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు..? వంటి విషయాలు వీక్షకులకు తెలుస్తున్నాయి. మరోవైపు బిగ్‌బాస్ విన్నర్ నేనే అవ్వాలి అనుకుంటున్న ప్రతి కంటెస్టెంట్ మిగిలిన వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. ( Bigg Boss 4: అభి, హారికల ‘హగ్’ టాపిక్.. కథ ఎక్కడికో పోతుందా..!)
ఇదిలా ఉంటే కంటెస్టెంట్‌లకు అర్ధరాత్రి బిగ్‌బాస్ షాక్ ఇచ్చాడు. అందరినీ లేపి సూట్‌కేసులు సర్దుకోమని చెప్పాడు. ఫినాలేకు వెళ్లడానికి ఎవరెవరు అడ్డుపడుతున్నారనుకుంటున్నారో వారి పేర్లు చెప్పాలని తెలిపారు. మరి ఎవరు ఎవరి పేర్లు చెప్పనున్నారో ఇవాళ్టి ఎపిసోడ్‌లో తేలనుంది. ( విజయవాడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం)