Bigg Boss 4: అభిజిత్‌-అఖిల్ మధ్య బిగ్‌ ఫైట్‌.. ఏడ్చేసిన మోనాల్‌

| Edited By:

Oct 05, 2020 | 12:38 PM

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల మధ్య రగడ, బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Bigg Boss 4: అభిజిత్‌-అఖిల్ మధ్య బిగ్‌ ఫైట్‌.. ఏడ్చేసిన మోనాల్‌
Follow us on

Bigg Boss 4 Telugu: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల మధ్య రగడ, బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఐదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించి ఇవాళ నామినేషన్‌ మొదలుకానుంది. ఈ క్రమంలో అభిజిత్‌, అఖిల్‌ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో అఖిల్‌కి క్రీమ్ పూసిన తరువాత అభి మాట్లాడుతూ.. మామాలుగా కన్ఫ్యూజ్‌ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా నేను అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన అఖిల్‌.. నువ్వు ముందు వేలు దించి మాట్లాడు అని అనగా.. నువ్వు ప్రతిసారి అదే చేస్తున్నావు అంటూ అభిజిత్‌ అన్నాడు.

ఆ తరువాత నువ్వు ఆ రోజు మోనాల్‌ని అలానే వేలు చూపించి మాట్లాడావు. అది బయటి వారికి ఎలా అర్థమవుతుంది అంటూ అఖిల్ కోప్పడ్డాడు. నేను ఆ అమ్మాయితో మాట్లాడితే నీకెందుకు అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అసహనానికి గురైన మోనాల్‌.. నా పేరును ప్రస్తావించకండి అంటూ ఏడ్చేసింది. ఆ సమయంలో గంగవ్వ, మోనాల్‌ని ఓదార్చింది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే ఇవాళ హౌజ్‌లో రచ్చ ఎక్కువగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ అంటూ తన కారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నారంటూ మోనాల్‌ ఇప్పటికే భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.

Read More:

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. వివరాలివే

మిస్టరీ మరణాలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య?