Bigg Boss 4: ‘సుడిగాడు’ సినిమా ద్వారా హీరోయిన్ మోనాల్ గజ్జర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతీ భాషల్లో కలిపి సుమారు 20 చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయిన ఈ భామ.. బిగ్ బాస్ షో ద్వారా భారీ పాపులారిటీ పొందిందని చెప్పాలి.
బిగ్ బాస్ సీజన్ 4లో గ్లామరస్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటరైన మోనాల్.. మొదట్లో అభిజిత్, అఖిల్ మధ్య నలిగిపోయింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో తను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రూవ్ చేసుకుంది. అలాగే హారికకు కెప్టెన్సీ టాస్క్‌లో సహాయపడి.. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది. ఇక సరిగ్గా ఫినాలేకు అడుగు దూరంలో 14వ వారం ఎలిమినేషన్స్‌లో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. నిజానికి మోనాల్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సి ఉందని.. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను కాపాడుతూ వచ్చారని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు కూడా చేశారు.
ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో యాంకర్ లాస్య అందరి కంటే అత్యధిక పారితోషికం తీసుకుందని.. ఆ తర్వాత జబర్దస్త్ అవినాష్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు మోనాల్ రెమ్యునరేషన్‌పై కూడా సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. మోనాల్ గజ్జర్ వారానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు అందుకున్నారని టాక్. మొత్తం 14 వారాలకు గానూ సుమారు రూ. 30 లక్షలు ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు పారితోషికంగా ఇచ్చారని టాలీవుడ్ టాక్. మరి ఇది నిజమో కాదో తెలియదు గానీ.. ఇప్పుడు నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్.
Also Read: