బిగ్‌బాస్ సీజన్ 4 హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్‌గా గేమ్ ఆడింది అరియానా గోరీ. బిగ్‌బాస్ ఇంట్లోలో తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం అరియానాను గెలిపించాలని కోరేంతగా క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.
తాజాగా టీవీ9తో అరియానా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు బిగ్‌బాస్ జర్నీలో ఎన్నో రకాల అనుభవాలను పొందానని తెలిపింది. తన పేరును అర్చన నుంచి అరియానాగా తన స్నేహితులవల్లే మార్చానని తెలిపింది. హౌస్‌లో అరియానా- సోహైల్, అరియానా- అవినాష్ మంచి కనెక్షన్స్ అని చెప్పుకొచ్చింది. అవినాష్‌తో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని.. ఇప్పటి వరకు మా మధ్య పెళ్ళికి సంబంధించిన ఆలోచనలు లెవని స్పష్టం చేసింది. ఇంట్లో అవినాష్ తనకు మంచి సపోర్ట్ ఇచ్చాడని తెలిపింది. సోహైల్‌తో తనకు మంచి ర్యాపో ఉందని.. కోపం లేదని, కేవలం ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవలు మాత్రమే అని వివరణ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదు. సంవత్సరం తర్వాత దాని గురించి ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చింది. లైఫ్‌లో బ్రేకప్ ద్వారా చాలా నేర్చుకున్నాని తెలిపింది.
ఇక ఎలాంటి అబ్బాయి కావాలని ప్రశ్నించగా.. క్యూట్‌గా తక్కువ మాట్లాడి, హోమ్లీగా ఉండే అబ్బాయి కావాలని.. అలాంటి వ్యక్తి తన లైఫ్‌లోకి వస్తే కచ్చితంగా అతనినే పెళ్ళి చేసుకుంటా అని తెలిపింది. ప్రస్తుతం యాంకర్‌గానే నా కెరిర్‌ను కొనసాగిస్తా.. కానీ ఆఫర్స్ వస్తే మాత్రం నటించడానికి సిద్ధంగా ఉన్ననంటూ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైన తనకు ప్రపోజ్ చేస్తే ఆ విషయం గురించి ఆలోచిస్తా అని.. దేవినాగవల్లి, దివి, హారిక తనకు మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది.