Ali Reveals Avinash Remuneration: అవినాష్ 100రోజులు హౌస్‌లో ఉంటే అంత ఇస్తే.. 9నెలలు ఇంట్లో ఉన్నా 5కోట్లు కావాలంటున్న అలీ

బిగ్ బాస్ షో ఎప్పుడు ఏ భాషలోనైనా వివాదాలకు కేంద్ర బిందువే.. ఈ షో వల్ల ప్రేక్షకులకు ఏమిటి ఉపయోగం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తారు. అయితే ఉపయోగం విషయం పక్కన పెడితే.. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్ధిక కష్టాల నుంచి..

Ali Reveals Avinash Remuneration: అవినాష్ 100రోజులు హౌస్‌లో ఉంటే అంత ఇస్తే.. 9నెలలు ఇంట్లో ఉన్నా 5కోట్లు కావాలంటున్న అలీ
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2021 | 7:25 PM

Ali Reveals Avinash Remuneration: బిగ్ బాస్ షో ఎప్పుడు ఏ భాషలోనైనా వివాదాలకు కేంద్ర బిందువే.. ఈ షో వల్ల ప్రేక్షకులకు ఏమిటి ఉపయోగం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తారు. అయితే ఉపయోగం విషయం పక్కన పెడితే ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్ధిక కష్టాల నుంచి గట్టెక్కితే.. మరికొంతమంది ఫేమ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ తెలుగు షో లో పాల్గొన్న కంటెస్టెంట్ లు తమకు వచ్చిన రెమ్యునరేషన్ లో తమ స్థాయిలో ఛారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అలా బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కిన కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్.

ఫైనల్ వరకూ చేరుకున్న అవినాష్ రెమ్యునరేష్ ను అలీ రవితేజ నటించిన క్రాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రివీల్ చేశాడు. కరోనా నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చి చాలా రోజులైందని.. అవినాష్ బిగ్ బాష్ హౌస్ లో ఉంటే యాభై లక్షలు ఇచ్చారు… తాను తొమ్మిది నెలలుగా ఇంట్లోనే ఉన్నా మరి నాకు ఐదు కోట్లు ఇవ్వాలని అంటూ హాస్యం పండించాడు అలీ. ఈ తొమ్మిది నెలలు డబ్బులు సంపాదించలేదు కానీ వంట నేర్చుకున్నానని తనదైన శైలిలో చెప్పాడు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు తాను ఆర్ధికపరమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించానని.. అయితే ఈ షో ద్వారా తనకు లభించిన రెమ్యునరేషన్ తో అప్పులు తీరిపోయి హాయిగా ఉన్నానని అవినాష్ చెప్పాడు. అయితే ఇప్పటి వరకూ అవినాష్ తనకు వచ్చిన రెమ్యునరేషన్ ను బయటపెట్టలేదు.. ఇప్పుడు అలీ వెంట అనుకోకుండా అవినాష్ అరకోటి తీసుకుకున్నాడనే విషయం బయటపడింది.