నాతో ఉన్నట్లుగా వేరే అబ్బాయితో క్లోజ్‏గా ఉంటే నచ్చదు. మనసులోని మాటను బయటపెట్టిన అఖిల్..

|

Dec 09, 2020 | 7:41 AM

బిగ్‏బాస్ హౌస్‏లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. అయితే బిగ్‏బాస్ చివరిదశలో ఉండటంతో ఇంటి సభ్యులందరూ చాలా సీరియస్‏గా గేమ్ ఆడుతున్నారు.

నాతో ఉన్నట్లుగా వేరే అబ్బాయితో క్లోజ్‏గా ఉంటే నచ్చదు. మనసులోని మాటను బయటపెట్టిన అఖిల్..
Follow us on

Big Boss Season 4: బిగ్‏బాస్ హౌస్‏లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. అయితే బిగ్‏బాస్ చివరిదశలో ఉండటంతో ఇంటి సభ్యులందరూ చాలా సీరియస్‏గా గేమ్ ఆడుతున్నారు. అయితే ఎంటర్‏టైన్ చేస్తూ మిమ్మల్ని మీరు నిరుపించుకోండి అని బిగ్‏బాస్ ఇచ్చిన టాస్క్‏లో అందరు ఉత్సహంగా పాల్గొన్నారు. అయితే ఇంట్లో మొదట రాజు అయిన సోహైల్ నవ్వుల రాజుగా మిగిలిపోయాడు. ఆ తర్వాత అభిజిత్ సాఫ్ట్ రాజుగా తన ఫెర్మెమెన్స్ ఉండగా.. హారిక రాణి అయినప్పుడు మాత్రం చిన్నపాటి గొడవలు జరిగాయి.

అయితే మంగళవారం నాటి ఎపిసోడ్‏లో మహారాణి అయినా అరియానా ఇంట్లోవాళ్ళకు ఓ టాస్క్ ఇచ్చింది. మీకు నచ్చిన వస్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాపకాన్ని పంచుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆ వస్తువును వాళ్ళకు నచ్చినవారికి ఇవ్వాలని చెప్పింది. దీంతో సోహైల్ తన గుర్తుగా అభిజిత్‏కు సస్పెండర్, హారికకు కత్తి, మోనాల్ కు టీషర్ట్, అరియానాకు పర్ఫ్యూమ్, అఖిల్ కు జాకెట్ ఇచ్చాడు. అనంతరం మహారాణిగా మోనాల్ బాధ్యతలు చేపట్టింది. తనలో మంచి చెడు ఏంటో చెప్పాలని మంత్రిగా ఉన్న అఖిల్‏ను అడిగింది మోనాల్. “ఒక మనిషి నిన్ను ద్వేషించినా కూడా ఇష్టపడడం మంచి లక్షణమైతే, సంతోషంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం చెడు లక్షణమని చెప్పాడు” అఖిల్. అలాగే నాతో ఉన్నట్లుగా వేరే అబ్బాయితో ఉంటే నాకు నచ్చదని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టేశాడు. అనంతరం అభిజిత్ అమ్మాయిగా నటిస్తూ సోహైల్‏ను పార్టీ ఒప్పించాలని టాస్క్ ఇచ్చింది మోనాల్. ఇందులో అరియానా, హారిక కూడా చేరడంతో స్కిట్టు సరిగా చేయలేకపోయారు. ఇందులో అరియానా బెస్ట్ రూలర్ గా ఎంపికైంది. దీంతో కన్ఫెషన్ రూంలోకి వెళ్ళిన ఆమె ఏడ్చేసింది. ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు మీ ప్రేమ కావాలి. ఈ ఒక్క మెట్టు నన్ను ఎక్కించండి. నాకు ఓటేసి సాయం చేయం అని అభ్యర్థించింది.