Big Boss Season 4: చిటికెస్తే నీ ముందు ఉంటా.. ఆ కంటెస్టెంట్‏తో అఖిల్ ప్రేమ పాఠాలు.. మళ్ళీ మొదలుపెట్టాడుగా

| Edited By: Anil kumar poka

Dec 08, 2020 | 10:04 AM

బిగ్‏బాస్ హౌస్‏లో గొడవల కంటే ఎక్కువగా ప్రేమ జంటలే దర్శననిస్తున్నాయి. గేమ్ మొదట్లో మోనాల్, అభి, అఖిల్ ట్రయాంగిల్ స్టోరి నడవగా.. మధ్యలో అభి హారికతో జతకట్టాడు.

Big Boss Season 4: చిటికెస్తే నీ ముందు ఉంటా.. ఆ కంటెస్టెంట్‏తో అఖిల్ ప్రేమ పాఠాలు.. మళ్ళీ మొదలుపెట్టాడుగా
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో గొడవల కంటే ఎక్కువగా ప్రేమ జంటలే దర్శననిస్తున్నాయి. గేమ్ మొదట్లో మోనాల్, అభి, అఖిల్ ట్రయాంగిల్ స్టోరి నడవగా.. మధ్యలో అభి హారికతో జతకట్టాడు. అభి సైడ్ అవ్వడంతో అఖిల్‏కు మోనాల్ దగ్గర లైన్ క్లియర్ అయ్యింది. ఇటీవల అఖిల్ మోనాల్ మధ్య మనస్పర్థలతో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. కాగా బిగ్‏బాస్ హౌస్‏లో పులిహోర రాజా ట్యాగ్ ఇచ్చేశారు హౌస్‏మేట్స్.

అయితే మోనాల్‏తో దూరం పెరగిందనో ఏంటో కానీ తాజాగా అరియానాతో, మరోవైపు హారికతో పులిహోర కలుపుతున్నాడు. టికెట్ టూ ఫినాలే రావడంతో అఖిల్ తెగ హూషారుగా ఉన్నాడు. ఇక బెడ్ రూంలో అరియానా టచ్ అప్ చేసుకుంటూ ఉండగా ఆమెతో ప్రేమ ముచ్చట్లు ప్రారంభించాడు. అవినాష్ లేడు కాబట్టి ఫుల్ రైట్స్ నాకే ఉన్నాయి. ఎలాంటి సహాయం కావాలన్న నన్నే అడగచ్చు, చిటిక వేస్తే చాలు నీ ముందు ఉంటాను అంటూ కబుర్లు చెప్పాడు. వెంటనే అరియానా కూడా రొమాంటిక్ టచ్ ఇచ్చింది. దీంతో అలా చూడకు నీ హావభావాలకు ఇంకా పడిపోతున్నానని అఖిల్ మరో షాక్ ఇచ్చాడు. మనం బ్రేక్ ఫాస్ట్ డేట్ కు వెళ్దామా అనగానే.. 14 వారం ఎఫెక్ట్ కదా అంటూ పంచ్ వేసింది అరియానా.

వెంటనే.. అదికాదు నీ పై ఎప్పటినుంచో ఒక ఎఫెక్ట్ ఉంది. కానీ చెప్పాలి అంటే ఒకలాంటి భయం వచ్చేస్తది. అందుకే ఇప్పుడు ధైర్యం చేసుకొని మాట్లాడుతున్నాను. మెంటాలిటీ కలవడం వలన ఇలాంటి పర్సన్ కావాలనిపిస్తది. కానీ నువ్వు బయట ఎవరో ఉన్నావని చెప్పావు కాబట్టి ఇంతకంటే ఎక్కువ వెళ్ళలేను అని అరియానాకు క్లారిటీ ఇచ్చాడు అఖిల్. ఒక వేళ బయట ఎవరు లేకపోతే చాలా హ్యాపీ అంటూనే.. ఎవరైనా ఉంటే మాత్రం హార్ట్ అవుతానని మళ్ళీ పులిహోర కలిపాడు.