కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ తమిళ రోజుకో ట్విస్ట్‌తో సాగిపోతోంది. ముఖ్యంగా లోస్లియా, కెవిన్ ప్రేమ వ్యవహారం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ షో సూపర్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్లు ఉండగా.. వారిలో వనితా విజయ్ కుమార్ ఒక సారి ఎలిమినేట్ అయి… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు లీకవ్వడంతో ఇప్పుడు తమిళ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఇక ఈ షోలో పాల్గొన్న హౌస్‌మేట్స్‌లో అందరికంటే ఎక్కువగా వనితా విజయ్ కుమార్ తీసుకుంటున్నారని.. అందువల్లే ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ ఇంట్లోకి పంపినట్లు తెలుస్తోంది.
వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ షో కోసం రోజుకు రూ. 2.5 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో ఎన్నో వివాదాలు సృష్టించినా.. టాస్కుల్లో చురుకుగా పాల్గొనడం.. ఇతర పార్టిసిపెంట్లతో ఆమె ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల మొదట 1.5 లక్షలు ఇచ్చిన నిర్వాహకులు.. రీ-ఎంట్రీలో ఆమెకు 2.5 లక్షలు రోజుకు ఇచ్చేలా బాండ్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నటుడు చేరన్ రోజుకు లక్ష తీసుకుంటున్నాడు.
శరవణన్ రోజుకు రూ. 80 వేలు, కవిన్ రోజుకు రూ. 50 వేలు, థర్శన్ రోజుకు రూ. 50 వేలు, ముగెన్ రోజుకు రూ. 50 వేలు, లోస్లియా రోజు రూ. 50 వేలు, మధుమిత రోజుకు రూ. 80 వేలు, కస్తూరి రోజుకు రూ. 1.25 లక్షలు, షెరిన్ రోజుకు రూ. 80 వేలు చార్జ్ చేసినట్లు సమాచారం.